- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొంథా తుఫానుపై ఎప్పటికప్పుడు సమీక్ష : మంత్రి లోకేష్
మొంథా తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యలను చేపట్టింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల (Cyclone Effected Areas) ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తుఫాను తీవ్రతపై సమీక్షిస్తున్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం (RTGS Centre) ద్వారా రాష్ట్రంలోని జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. అంతేకాకుండా పరిస్థితులను అంచనా వేస్తూ సహాయ, పునరావాస చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాల్లోని ప్రత్యేక అధికారులతో (Special Officers) ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వివరాలను తెలుసుకుంటున్నామని వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Read More.. మొంథా ఎఫెక్ట్: 107 రైళ్ల రద్దు.. వివరాలివే
Floods Alert: అతి భారీవర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్






