10 మంది ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు.. భారీగా ఫైన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-31 13:35:05  IST  )

ఎర్రచందనం రవాణా చేస్తూ పట్టుబడిన 10 మంది స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ..

10 మంది ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు.. భారీగా ఫైన్
X

దిశ, వెబ్ డెస్క్: ఎర్రచందనం అక్రమ రవాణా(Red sandalwood smuggling) చేస్తూ పట్టుబడిన 10 మంది స్మగ్లర్లు ఒకొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష(Imprisonment) పడింది. అలాగే రూ. 6లక్షల చొప్పున జరిమానా సైతం కట్టాలని ఆదేశాలు వచ్చాయి. ఎర్రచందనం స్మగ్లర్లపై గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసులపై తాజాగా విచారణ జరిగింది. తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి గురువారం తుది తీర్పు నిచ్చారు.

తమిళనాడు తిరువన్నామలై, వేలూరు జిల్లాలకు చెందిన 1. విశ్వనాథన్, 2. డి సేతు, 3. డి. రమేష్, 4. ఎం. సంపత్, 5. వి.రత్నం, 6. ఎం. బూఛాయాన్, 7. జె. కుమార్, 8. సి. ప్రభు 9. ఎం. సురేష్, 10.. సి.రామర్ ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పెరుమాల్లపల్లి బీటు, టీఏన్ పాలెం సెక్షన్ ఎస్వీఎన్పీ డివిజన్‌లో పట్టుబడ్డారు. నేరం రుజువు కావడంతో నిందితులకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కోర్టుకు హాజరు కానీ ముద్దాయి ప్రభుకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు 9 మందిని నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించారు.

Next Story