- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో రికార్డ్ స్థాయి దర్శనాలు
by velandi.Saikiran |
తిరుమలలో రికార్డు స్థాయి దర్శనాలు నమోదు అవుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో రికార్డు స్థాయి దర్శనాలు నమోదు అవుతున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు ఉన్న నేపథ్యంలో మే నెలలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మే మాసంలో మొత్తం 25,46,168 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారికంగా టీటీడీ పాలకమండలి ప్రకటన చేసింది. మే 24వ తేదీన అత్యధికంగా 98,058 మంది భక్తులు తరలివచ్చినట్లు వెల్లడించింది.
ఇక తిరుమల హుండీ ఆదాయం మే నెలలో రూ.120.28 ఓట్లుగా నమోదు అయింది. మే మాసంలో మొత్తం 12,29,773 మంది తలనీలాలు సమర్పించారు. సమ్మర్ హాలిడేస్, పరీక్షా ఫలితాల నేపథ్యంలో తిరుమలలో ఈ భక్తి రద్దీ పెరిగినట్లు టీటీడీ పాలకమండలి అంచనా వేస్తోంది. జూన్ మొదటి రెండు వారాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని కూడా చెబుతున్నారు.
Next Story






