- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD:తిరుమలలో పని చేయని సిఫార్సు లేఖలు.. కారణం ఇదేనా!?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సిఫార్సు లేఖలతో వచ్చిన భక్తులకు షాకింగ్ ఘటన ఎదురైంది.
వేసవి కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రజాప్రతినిధులు, IAS, IPS, ఇతర ప్రభుత్వ అధికారుల సిఫార్సు లేఖలను టీటీడీ(TTD) తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సిఫార్సు లేఖలు తిరస్కరిస్తున్న విషయం పై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో లేఖలతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో సిఫార్సు లేఖలతో వచ్చిన భక్తుల పరిస్థితి అయోమయంగా మారింది. అయితే.. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి 3 నెలలపాటు సిఫార్సు లేఖలు స్వీకరించరు. కానీ.. దీనిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో భక్తులు లేఖలతో శ్రీవారి దర్శనానికి క్యూ కడుతున్నారు. కాగా.. స్వయంగా వచ్చే వీఐపీ ప్రొటోకాల్ పరిధిలోని భక్తులకు, ప్రొసీజర్ ప్రకారం అప్లికేషన్ చేసుకునే వారికి మాత్రమే బ్రేక్ దర్శనాన్ని కల్పించనున్నట్లు తెలుస్తోంది.






