సినీ రంగానికి సహకరించేందుకు సిద్ధం.. మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-26 06:33:25  IST  )

పవన్ కల్యాణ్ సినిమా విడుదల ముందు ఎవరైనా థియేటర్లు బంద్ చేసే నిర్ణయం తీసుకోవడం దుస్సాహాసమే అవుతుందని నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు విదితమే

సినీ రంగానికి సహకరించేందుకు సిద్ధం.. మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ సినిమా విడుదల ముందు ఎవరైనా థియేటర్లు బంద్ చేసే నిర్ణయం తీసుకోవడం దుస్సాహాసమే అవుతుందని నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు విదితమే. పవన్ సినిమాను అడ్డుకునే వారిలో ‘ఆ నలుగురు’ ఉన్నరంటూ వచ్చిన వార్తలకు తనకు సంబంధం లేదన్నారు. ఆ నలుగురిలో తాను లేనని.. వారితో అన్ని సంబంధాలు ఏనాడు తెంచుకున్నానని అన్నారు. తెలంగాణలో తనకు AAA తప్ప నాకు ఒక్క థియేటర్ కూడా లేదని.. ఆంధ్రాలో కూడా కేవలం 15 లోపే ఉన్నాయని అన్నారు. ‘ఆ నలుగురు’ అని వేసేటప్పుడు తన పేరు వాడొద్దని సూచించారు. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని కలవాలని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఈ క్రమంలోనే ఇదే అంశంపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ స్పందించారు. సినిమా థియేటర్ల అంశంపై అల్లు అరవింద్ మాట్లాడింది అవాస్తవమని అన్నారు. సినీ రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో చేశారని గుర్తు చేశారు.

సినీ పెద్దలు వేధింపులకు గురి కాలేదా..

టికెట్ల ధరల పెంపుపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోందని తెలిపారు. టికెట్ల రేట్లు పెంచాలని నిర్మాతలు కోరినప్పుడు పెంచుతున్నామని అన్నారు. టికెట్ రేటు రూపాయి పెంచింతే ప్రభుత్వానికి పావలా GST వస్తుందని.. మా సమస్య మేమే పరిష్కరించుకుంటామని అహంభావంతో మాట్లాడతున్నారని ఫైర్ అయ్యారు. సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వ సహకారం అవసరమని.. గత ప్రభుత్వంలో సినిమా రంగానికి చెందిన వ్యక్తులు వేధింపులకు గురైన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. సినిమా రంగం ప్రైవేటు రంగమైతే గత ప్రభుత్వంలో ఎందుకు నియంత్రించారని ప్రశ్నించారు.

పేర్ని నాని పిచ్చి ప్రేలాపనలు..

ప్రతి సారి పవన్ సినిమా విడుదల సమయంలోనే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని మంత్రి కందుల దుర్గేశ్ మండిపడ్డారు. ఇక వీరమల్లు సినిమా ఫ్లాప్ అంంటూ పేర్ని నాని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని అన్నారు. సినిమా రిలీజ్‌కు ముందే బాధ్యత లేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కనీస మానవత్వం లేకుండా పేర్ని నాని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మనుషులు చచ్చిపోవాలని పేర్ని నాని కోరుకుంటున్నాడని.. వల్లభనేని వంశీ మరణంతో రాజకీయ ప్రయోజనాన్ని ఆయన ఆశిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంపై ఎలాంటి అవగాహన లేకుండా పేర్ని నాని మాట్లాడుతున్న మాటలు సిగ్గచేటని అన్నారు.

సినిమా రంగానికి సహకరిస్తున్న ప్రభుత్వాన్ని కలవాలని పవన్ చెప్పారని.. తాను కూడా నిర్మాతలతో పాటు ఫిలిం ఛాంబర్‌ కలిసి పని చేద్దామమంటూ లేఖ రాశానని కందుల దుర్గేశ్ అన్నారు. సినిమా రంగం కోసం పాలసీ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. థియేటర్లు బంద్ ప్రస్తావన వచ్చినప్పుడు ఫిలిం ఛాంబర్ క్లారిటీ ఇవ్వాలన్నారు. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు కలిసి రావాలన్నారు. ప్రభుత్వం సినిమా రంగానికి సహకరించేందుకు సిద్ధంగా ఉందని.. థియేటర్ల బంద్ నిర్ణయంపై హోంశాఖ విచారణ కొనసాగుతోందని మంత్రి దుర్గుశ్ స్పష్టం చేశారు.

Next Story