ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్.. 80% సబ్సిడీతో రుణాలు

by Vemula.Srinu Prasad |

ఒంటరి మహిళలకు ఆర్డీటీ గుడ్ తెలిపింది....

ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్.. 80% సబ్సిడీతో రుణాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఒంటరి మహిళల(single woman)కు ఆర్డీటీ(Rdt) గుడ్ తెలిపింది. ఆర్థిక స్వావలంబన కోసం 80% సబ్సిడీతో రుణాలు(Loans) అందిస్తోంది. ‘‘ఉమెన్ టు ఉమెన్”(Woman to Woman) కార్యక్రమం పేరుతో ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. మహిళలకు ఆవులు, గేదెల పెంపకం, కిరాణా, వస్త్ర దుకాణాల వంటి స్వయం ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముందుగా అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది.

అయితే ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న మహిళలకు స్పెయిన్‌లోని మహిళలు ప్రతి ఏడాది రూ.4 వేల ఆర్థిక సాయం చేయనున్నారు. ఇలా మహిళలు ప్రతి నెల రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఆదాయం సంపాదించుకొచ్చు. ఇప్పటికే జిల్లాకు చెందిన రాములమ్మ అనే లబ్ధిదారులు రూ.1.20 లక్షల రుణం తీసుకున్నారు. ఆ డబ్బుతో ఆవులు కొనడం, షెడ్లు నిర్మించడం వంటి కార్యక్రమాలు ప్రారంభించారు. ఇందులో 20 వేల రూపాయలమే తిరిగి చెల్లించారు. మరో మహిళ కిరాణా ఏర్పాటు చేయడం ద్వారా నెలకు రూ.15 వేల నుంచి18 వేల సంపాదిస్తున్నారు.

Next Story