- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడపిల్లను, సాఫ్ట్‌గా ఉంటానని అనుకోవద్దు.. పార్టీలపై రంగా కుమార్తె సంచలన వ్యాఖ్యలు
దివంగత నేత వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ‘మన రంగానాడు’ భారీ బహిరంగ సభలో ఆయన కుమార్తె ఆశా కిరణ్ సంచలన కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత నేత వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ‘మన రంగానాడు’ భారీ బహిరంగ సభలో ఆయన కుమార్తె ఆశా కిరణ్ సంచలన కామెంట్స్ చేశారు. ‘37 ఏళ్లుగా మీరు రంగా కోసం ఏం చేశారు?’ అంటూ వైసీపీ, జనసేన, టీడీపీ పార్టలను నేరుగా నిలదీశారు. ఎన్నికల సమయంలో వంగవీటి రంగా ఫోటోను ప్రచారానికి వాడుకుని ఓట్లు అడుగుతున్నారని, ఆ తర్వాత ఆయన పేరు, ఆశయాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్నికల్లో రంగా ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. మరి ఇన్నేళ్లలో ఆయన కోసం చేసిన పని ఏంటి? అని ప్రశ్నించారు. కృష్ణ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలన్న డిమాండ్‌ను ఆమె మరోసారి తెరపైకి తెచ్చారు. మూడేళ్లుగా అడుగుతున్నాం.. కృష్ణ జిల్లాకు రంగా పేరు ఎప్పుడూ పెడతారు? ప్రజల మనోభావాలను ఎప్పుడూ గౌరవిస్తారు? అంటూ రాజకీయ పార్టీలను ప్రశ్నించారు.
సభను అడ్డుకునేందుకు కొన్ని అరాచక శక్తులు ప్రయత్నాలు చేశాయని ఆరోపించిన ఆమె, సభకు రాకుండా భయపెట్టే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. అయితే రంగా అభిమానులను ఎవరూ భయపెట్టలేరని ఫైర్ అయ్యారు. ‘అడ్డమైన పాలిటిక్స్ చేస్తే ఊరుకోం’ అంటూ హెచ్చరించారు.
తాను వారసత్వం కోసం కాదు, రంగా ఆశయాల అమలుకోసమే మాట్లాడుతున్నానని ఆశా కిరణ్ స్పష్టం చేశారు. ఇకపై మృదువుగా వ్యవహరించేది లేదని చెప్పారు. ఆడపిల్లను, సాఫ్ట్‌గా ఉంటానని అనుకోవద్దు.. నాలో ఉన్నది రంగా రక్తమే. వెనకడుగు వేసేది లేదు.. సై అంటూ ముందుకే వెళ్తా.. అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా హత్యకు 37 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంగా ఆయన ఆశయాల అమలుపై రాజకీయ పార్టీల బాధ్యతను గుర్తు చేస్తూ చేసిన ఆశా కిరణ్ వ్యాఖ్యలు సభావేదికపై తీవ్ర చర్చకు దారితీశాయి.






