- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటింగ్‌లో పాల్గొనకపోవడం బాధాకరం: రామ్మోహన్ నాయుడు ఎమోషనల్ ట్వీట్
అమరావతి ఒక రాజధాని మాత్రమే కాదని, ఇది ప్రజల కలలు, ఆశయాలు, సమిష్టి సంకల్పానికి ప్రతీక అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు....

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) ఒక రాజధాని మాత్రమే కాదని, ఇది ప్రజల కలలు, ఆశయాలు, సమిష్టి సంకల్పానికి ప్రతీక అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లు(Amaravati Legalization Bill)కు లోక్‌సభ(Lok Sabha)కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కొత్త ఉత్సాహంతో, ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణంగా నిలిచే అభివృద్ధి, అవకాశాల కేంద్రంగా అమరావతిని నిర్మిస్తున్నామని చెప్పారు. అయితే, ఇలాంటి కీలక బిల్లుపై దేశమంతా ఏకాభిప్రాయంతో మద్దతు తెలిపిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) ఓటింగ్‌లో పాల్గొనకపోవడం బాధాకరమని రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముందున్న ప్రయాణం ఎంతో ఆశాజనకంగా ఉండబోతుందని తెలిపారు. అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇది దేశానికి శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా ఎదిగి, నగరాల అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.
ఇది ఒక కీలక ఘట్టం
‘‘లోక్ సభలో AP Reorganisation Act, 2014 సవరణతో అమరావతిని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించడం ఒక కీలక ఘట్టం. ఈ విజయాన్ని అమరావతి రైతులకు, నారీ శక్తికి అంకితం చేస్తున్నా. అమరావతి కలను పరిరక్షించడం కోసం తమ భూములను త్యాగం చేసి, ఎన్నో ఏళ్లుగా సాగిన పోరాటంలో దృఢంగా నిలబడిన రైతులు, మహిళలే ఈ ఉద్యమానికి వెన్నెముక. ఒక తెలుగు వాడిగా, ఈ గడ్డపై పుట్టిన పౌరుడిగా ఈ నిర్ణయం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, హోం మంత్రి అమిత్ షాకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.’’ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.






