Rammohan Naidu: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

అయ్యప్ప స్వాములకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు.

Rammohan Naidu: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: అయ్యప్ప స్వాములకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ ఆయన విశాఖ - విజయవాడ మధ్య ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఇండోగో విమాన సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప స్వాములు ఇక నుంచి ఇరుముడితో ఫ్లైట్‌లో ప్రయాణించేందుకు అనమతిస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 20 వరకు సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారణ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని తెలిపారు. నిర్ణీత గడువు కంటే ముందే ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తామని అన్నారు. త్వరలోనే ఇంటర్‌నేషనల్ కార్గో సెంటర్ అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Next Story