- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మౌనం ద్వారా జ్ఞానం అందించిన రమణ మహర్షి
మౌనం ద్వారా రమణ మహర్షి జ్ఞానం అందించారని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : మౌనం ద్వారా రమణ మహర్షి జ్ఞానం అందించారని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) అన్నారు. రమణ మహర్షి జయంతిని పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా ఆయనను స్మరించుకున్నారు. రమణ మహర్షి ((Ramana Maharshi) బోధనల గురించిన విషయాలను తన ఫాలోవర్లతో పంచుకున్నారు. రమణ మహర్షి ఆధ్యాత్మిక శిఖరం అని కొనియాడుతూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
రమణ మహర్షి అందించిన "నేనెవరు?" (Self-Inquiry) అనే ఆత్మ విచారణ మార్గం నేటికీ కోట్లాది మంది సాధకులకు దిక్సూచిగా నిలుస్తోందని అన్నారు. అంతర్గత శాంతి, విశ్వవ్యాప్త కరుణ, స్వీయ అన్వేషణ ద్వారా పరమార్థాన్ని చేరుకోవచ్చని మహర్షి తన జీవితం ద్వారా నిరూపించారని తెలిపారు. కేవలం మౌనం ద్వారానే ప్రపంచానికి ఎంతో లోతైన జ్ఞానాన్ని అందించిన రమణులు, ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మజ్ఞాన జ్యోతిని వెలిగించారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
రమణ మహర్షి బోధనలు కేవలం సిద్ధాంతాలకు పరిమితం కాకుండా, ప్రతి వ్యక్తి తన ఉనికిని తాను ప్రశ్నించుకునేలా ప్రేరేపిస్తాయని విజయసాయి రెడ్డి వివరించారు. 1879లో జన్మించిన రమణులు తన 16వ ఏటనే మరణ భయాన్ని జయించారన్నారు. ఆత్మ సాక్షాత్కారం పొంది అరుణాచల క్షేత్రంలో స్థిరపడ్డారని గుర్తు చేసుకున్నారు. బాహ్య ప్రపంచపు ఆడంబరాలకు దూరంగా, నిరాడంబరమైన జీవితాన్ని గడిపారన్నారు. సకల జీవుల పట్ల అపారమైన ప్రేమను ప్రదర్శించిన ఆయన సందేశం సర్వకాలీనమని స్పష్టం చేశారు. ప్రజలంతా రమణ మహర్షి చూపిన సత్యం, శాంతి మార్గంలో పయనిస్తూ లోక కల్యాణానికి పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు.






