అమరావతి బిల్లుపై రాజ్యసభలో చర్చ.. జగన్‌ తీరుపై ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-02 09:00:04  IST  )

వైసీపీ అధినేత జగన్ తీరును చూసి జనం నవ్వుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ చేపట్టారు....

అమరావతి బిల్లుపై రాజ్యసభలో  చర్చ..  జగన్‌ తీరుపై ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్ తీరును చూసి జనం నవ్వుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ తోపాటు వైసీపీపైనా నిప్పులు చెరిగారు. రాజధాని పట్ల పిల్ల కాంగ్రెస్ పిల్ల చేష్టలు చూపించిందని ఎద్దేవా చేశారు. ఈ చేష్టలు చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోయిందని విమర్శించారు. పిల్ల, తల్లి కాంగ్రెస్‌ను ఏపీ ప్రజలు మట్టికరిపించారని లక్ష్మణ్ గుర్తు చేశారు. రాజధానిని నిర్ణయించే హక్కు రాష్ట్రాలకు ఏ చట్టంలో ఉంది ప్రశ్నిస్తున్నారని, కొత్తగా మావిగన్ అనే పేరు తెరపైకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. రాజధాని కోసం పోరాటం చేసిన రైతులపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణకు మోడీ ప్రభుత్వం రూ. 12 లక్షల కోట్లు ఇచ్చిందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేసినందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story