రాజధాని అంటే బాబు దృష్టిలో గేటెడ్ కమ్యూనిటీ ఏరియానా..?

by Disha Web Desk 7 |
రాజధాని అంటే  బాబు దృష్టిలో గేటెడ్ కమ్యూనిటీ ఏరియానా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి భూముల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్రప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్లస్థలాలివ్వాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. జీవో నెంబర్‌ 45ను సమర్ధిస్తూ పేదలకు అనుకూలంగా హైకోర్టు ధర్మాసనం తీర్పునివ్వడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వెల్లడించారు. ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకానికి ఇళ్లుండాలని.. పేదలు నివాసం లేకుండా ఎక్కడా ఉండకూడదని ఒక మహాయజ్ఞంలా సుమారు 30 లక్షలమందికి ఇళ్లస్థలాలు పంపిణీ చేసిన ఘనత దేశచరిత్రలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.

ఇందులో భాగంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పేదలకివ్వడానికి భూములు అందుబాటులో లేకపోవడంతో అమరావతి ప్రాంతంలో కొంత భాగాన్ని ఎంపికచేసి పేదలకు నివాసం ఏర్పాటు చేస్తుంటే, దానిని టీడీపీ వ్యతిరేకించడం సమంజసం కాదు అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తలపెట్టిన పేదలకు నివాసాల్ని అమరావతి ప్రాంతంలో కేటాయిస్తే ఇక్కడ డెమోగ్రఫిక్ ఇం బ్యాలెన్స్‌ వస్తుందనే వాదనతో వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందని చెప్పుకొచ్చారు.పేదలకు, అణగారిన వర్గాల వారికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నోరుమెదపకుండా టీడీపీ మరలా సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయడం చాలా దారుణం, దుర్మార్గం, అన్యాయం అని చెప్పుకొచ్చారు.

‘ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న ‘క్లాస్‌వార్‌’ అని అభిప్రాయపడ్డారు. సీఎం వైఎస్ జగన్ పేదల పక్షాన నడుస్తున్నారు.. డబ్బున్న భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అని చెప్పుకొచ్చారు. ఈ క్లాస్‌వార్‌లో టీడీపీ, చంద్రబాబు ఎటువైపు ఉన్నారు..? పేదల పక్షాన ఉన్నారా..? పేదలకు వ్యతిరేకంగా ఉన్నారా..? మీకు రాబోయే ఎన్నికల్లో పేద ప్రజల ఓట్లు కావాలంటే, ఇప్పుడు పేదలకు అనుకూలంగా ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం తీర్పును స్వాగతించకుండా.. పేదలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు ఎందుకు అప్పీల్‌కు వెళ్లారో అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆలోచనల్లో రాజధాని ప్రాంతం అంటే ఒక గేటెట్‌ కమ్యూనిటీ ఏరియా అనుకుంటున్నారా..? మీరనుకున్న ప్రత్యేక సామాజికవర్గానికి చెందిన వారే ఇక్కడ ఉండాలనుకుంటున్నా రా..? అమరావతైనా.. హైదరాబాదైనా.. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు నివసిస్తారు.

అందులో తప్పేంటి..? ఇటువంటి విషబీజాల్ని టీడీపీ ఎందుకు పెంచిపోషిస్తుంది అని డొక్కా మాణిక్య వరప్రసాద్ నిలదీశారు. రాజకీయాంశాలు ఎలా ఉన్నప్పటికీ, పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండి నివాసాల్ని కల్పించే క్రమంలో వామపక్షాలు, ప్రజాసంఘాలు సమర్ధించకపోతే పేదలకు న్యాయం జరిగే అవకాశమే లేదు. కనుక, పేదలపక్షాన ఉండేవారంతా హైకోర్టు తీర్పును స్వాగతించాలని.. జగన్ నాయకత్వాన్ని సమర్ధించాల్సిన అవసరం ఉందని డొక్కా మాణిక్యవరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. పేదలకు వ్యతిరేకంగా.. ధనికవర్గాలకు అనుకూలంగా మాత్రమే పనిచేయాలనుకునే పురాతనమైన, పాడుబడ్డ ఆలోచనను టీడీపీ వెనక్కితీసుకోవాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు.

Also Read.. టీడీపీ-జనసేన కలిసిపోటీ చేస్తే 150 సీట్లు ఖాయం: గోనె ప్రకాశ్ రావు

‘దర్యాప్తు జరుగుతోంది.. చంద్రబాబు అరెస్ట్‌ను ఎవరూ ఆపలేరు’

మీ రాష్ట్రాన్ని మీరు చూసుకోండి.. తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రి సీరియస్



Next Story

Most Viewed