Breaking: ఐదేళ్ల వైసీపీ దుర్మార్గ పాలనలో.. ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారింది: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

by Shiva Kumar |
Breaking: ఐదేళ్ల వైసీపీ దుర్మార్గ పాలనలో.. ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారింది: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారిందంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఒంగోలులో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ.. జగన్ పారిపాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని తెలిపారు. ఎక్కడ చూసిన ల్యాండ్, ఇసుక మాఫీయ ప్రజలను పట్టి పీడిస్తోందని ఆరోపించారు. జగన్ పచ్చి అబద్ధాల కోరు అని.. ప్రజలను ఆ అబద్ధాలతోనే మభ్య పెట్టడం ఆయనకు అలవాటేనని ఫైర్ అయ్యారు. ఇలాంటి రాక్షసుడిని తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదని అన్నారు. అక్రమార్కులకు కొమ్ముకాస్తూ.. ప్రభుత్వమే అవినీతి, దోపిడీ, కబ్జాలు, అరాచకాలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న వైసీపీ సర్కార్‌ను ఓటుతోనే గద్దే దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed