నన్ను కలవను అని సంతోష్ చేత కేసీఆర్ చెప్పించారు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
నన్ను కలవను అని సంతోష్ చేత కేసీఆర్ చెప్పించారు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 40 ఉత్తరాలు రాశానని అన్నారు. అందులో ఒక్క ఉత్తరానికి కూడా కేసీఆర్ సమాధానం ఇవ్వలేదని చెప్పారు. తొమ్మిదేళ్ల పాటు కేసీఆర్‌ను కలవాలని ఎంతో ప్రయత్నించాను. నన్ను కలిసే ఉద్దేశం లేదని కేసీఆర్ సంతోష్ ద్వారా తనకు చెప్పారు. ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్‌గా సీఎం అయ్యారని తెలిపారు. అందుకే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు.

అప్పుడు కేసీఆర్ ఎలా మాట్లాడారో.. ఇప్పుడు రేవంత్ కూడా అలాగే మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం కాకముందే బెదిరింపులకు పాల్పడ్డారని గుర్తుచేశారు. ఇప్పుడు బెదిరింపులకు పాల్పడబోరు అని మాట్లాడుకోవడం తప్పు అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లుగా రాష్ట్రానికి ఎన్నో నిధులు ఇచ్చామని అన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. మొత్తంగా తెలంగాణకు రూ.9 లక్షల కోట్లు తెచ్చామని అన్నారు. ఈ ఎన్నికల్లో తమను ప్రజలు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులను కూడా మంచి వ్యక్తులను పోటీలో పెట్టామని తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed