నేడు రాజంపేట, రైల్వేకోడూరు బంద్.. కడప-తిరుపతి హైవేపై నిలిచిన రాకపోకలు

by Kema Shiva Kumar |

రాజంపేట (Rajampet)ను అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యాలయంగా చేయాలని డిమాండ్ చేస్తూ రాజంపేట జాయింట్ ఆక్షన్ కమిటీ (JAC) ఇవాళ సాయంత్రం వరకు బంద్‌కు పిలుపునిచ్చింది.

నేడు రాజంపేట, రైల్వేకోడూరు బంద్.. కడప-తిరుపతి హైవేపై నిలిచిన రాకపోకలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజంపేట (Rajampet)ను అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యాలయంగా చేయాలని డిమాండ్ చేస్తూ రాజంపేట జాయింట్ ఆక్షన్ కమిటీ (JAC) ఇవాళ సాయంత్రం వరకు బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే, ప్రస్తుతం రాయచోటి జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉండటంతో రాజంపేట, రైల్వేకోడూరు (Railwaykoduru), రాయచోటి నియోజకవర్గాల ప్రజలకు అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఎదురవుతున్నాయని, రాజంపేట సెంట్రల్ లొకేషన్ కావడంతో ఇక్కడే హెడ్‌క్వార్టర్స్ ఉంటే మంచిదని జేఏసీ నాయకులు వాదిస్తున్నారు. ఈ బంద్‌కు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు జగన్‌మోహన్ రాజు, వెల్లటూరు శ్రీనివాస రాజు, లోకేష్ మొదలైనవారు సంపూర్ణ మద్దతు పలికారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని, ప్రజలు సహకరించాలని సోమవారం జేఏసీ నాయకులు అభ్యర్థించగా.. ఇవాళ అంతా బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. ఈ ప్రభావంతో బంద్ కారణంగా కడప-తిరుపతి జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

Next Story