ఏపీలో వర్ష బీభత్సం.. అతలాకుతలం అయిన జిల్లాలు

by Malleboina Mahesh |

: వాతావరణ శాఖ హెచ్చరికలకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి

ఏపీలో వర్ష బీభత్సం.. అతలాకుతలం అయిన జిల్లాలు
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరికలకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వరదలు సంభవిస్తున్నాయి. నిన్నటి నుంచి విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్ష బీభత్సం తో విద్యుత్ స్తంభాలు, రహదారులు, పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, భోగాపురం, మండలాల్లో అరటి పంట నేలమట్టమైంది. గజపతినగరం మండలం మర్రివలస లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి.

అలాగే విజయనగరం జిల్లాలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు తోడు 60 కి. మీ వేగంతో వీచిన గాలులకు చెట్లు విరిగిపడటంతో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు 80% విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా అప్రమత్తం అయిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పది మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వానికి హెచ్చరికలు రావడంతో.. ముందస్తుగానే చర్యలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తుంది.

Next Story