- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు
by Naga Rani Yarlagadda |
ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో రాష్ర్టంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో రాష్ర్టంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అలాగే కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో దాదాపు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. ప్రజలు చెట్లు, హెర్డింగుల వద్ద నిలబడవద్దని, రైతన్నలు కూడా పొలం పనులు సకాలంలో పూర్తి చేసుకుని వెళ్లాలని అధికారులు సూచించారు.
Next Story






