రాబోయే 3 గంటల్లో పలు చోట్ల వర్షం

by Vemula.Srinu Prasad |

రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అంతేకాదు వాతావరణం కూడా గణనీయంగా మారుతుందని వెల్లడించింది...

రాబోయే 3 గంటల్లో పలు చోట్ల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. అంతేకాదు వాతావరణం కూడా గణనీయంగా మారుతుందని వెల్లడించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొన్నారు.

Next Story