- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి వర్షసూచన.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
by Ajay Maddhiboyina |
ఏపీలో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రుళ్లు చలి వాతావరణం కనిపిస్తుండగా పగటిపూట ఎండలు కొడుతున్న సంగతి తెలిసిందే. కొన్నిజిల్లాల్లో చలి పంజా విసురుతోంది. అయితే ఇప్పుడు వర్షసూచన ఉండటంతో రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.
Next Story






