మ‌రో రెండు రోజులు వాన‌లే

by Vemula.Srinu Prasad |

ద్రోణి ప్ర‌భావంతో మ‌రో రెండు రోజులు రాష్ర్టంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ సూచించింది. ఉత్తరాంధ్ర తీరప్రాంతము నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు....

మ‌రో రెండు రోజులు వాన‌లే
X

దిశ‌, ఏపీ బ్యూరో: ద్రోణి ప్ర‌భావంతో మ‌రో రెండు రోజులు రాష్ర్టంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ సూచించింది. ఉత్తరాంధ్ర తీరప్రాంతము నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరొక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో మరో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సోమవారం కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందన్నారు.

మంగళగిరిలో 68.2మిమీ

ఆదివారం సాయంత్రం 4 గంటల నాటికి గుంటూరు జిల్లా మంగళగిరిలో 68.2మిమీ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా విజయనగరం జిల్లా రాజాంలో 52.5మిమీ, గుంటూరు జిల్లా కాకుమానులో 51.5మిమీ, తాడేపల్లిలో 45.2మిమీ, ఎన్టీఆర్ జిల్లా కవులూరులో 41.5మిమీ, బాపట్ల జిల్లా భట్టిప్రోలు 39.9మిమీ చొప్పున వర్షపాతం రికార్డ‌యింది.

Next Story