తెలంగాణకు వర్షసూచన.. మరో రెండు గంటల్లో ఆ జిల్లాల్లో వర్షం

by Ajay Maddhiboyina |

తెలంగాణకు నేడు వర్షసూచన ఉన్నట్టు వెదర్ మ్యాన్ బాలాజీ వెల్లడించారు. 2026 సంవత్సరంలో తొలి వర్షం కురవబోతుందని పేర్కొన్నారు.

తెలంగాణకు వర్షసూచన.. మరో రెండు గంటల్లో ఆ జిల్లాల్లో వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణకు నేడు వర్షసూచన ఉన్నట్టు వెదర్ మ్యాన్ బాలాజీ వెల్లడించారు. 2026 సంవత్సరంలో తొలి వర్షం కురవబోతుందని పేర్కొన్నారు. మరో రెండు గంటల్లో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ముఖ్యంగా బీదర్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా తెలంగాణలోని హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో పొడి వాతావరణం కనిపిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం వరకు చలి పంజా విసరగా నిన్నటి నుండి రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. అంతే కాకుండా పగటివేలల్లో ఎండలు సైతం మండిపోతున్నాయి.

Next Story