- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RAIN ALERT: ఏపీకి వర్షసూచన.. ఆ మూడు జిల్లాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు
ఏపీలో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై దాని ప్రభావంతో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అకాశం ఉందని పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై దాని ప్రభావంతో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మొస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే విధంగా బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. తీవ్ర వాయుగుండం రేపు మధ్యాహ్నం ఉత్తర శ్రీలంక ట్రింకోమలీ జఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో పొడివాతావరణం కనిపిస్తోంది. పగటిపూట ఎండ కొడుతుండగా రాత్రులు చలి తీవ్రత పెరుగుతోంది. ఇక రెండు రోజులు వర్షసూచన ఉండటంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.






