- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
రాష్ట్రప్రజలకు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రప్రజలకు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడవచ్చని వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో రేపు(సోమవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తరుణంలో ఏపీలో నదుల వరద ఉధృతి క్రమంగా తగ్గుతుందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల వరద(Flood) పూర్తిస్థాయిలో తగ్గేవరకు ఆయా నదీ పరీవాహక ప్రాంతం, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.






