- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Heavy Rain Alert:రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఏపీకి మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలో ఇవాళ(సోమవారం) పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విజయనగరం, విశాఖ, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ క్రమంలో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక, తెలంగాణకు రెండు రోజులు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. దీంతో నేడు(సోమవారం), రేపు(మంగళవారం) తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.






