- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల(జులై)24వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో నిన్న(గురువారం) పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు 24వ తేదీ వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా. జార్ఖండ్, బిహార్‌లలో ఉన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది.
వాయుగుండం ప్రభావంతో విస్తరించిన రుతు పవనద్రోణి తూర్పు బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతం వరకూ విస్తరించింది. రేపు(శనివారం) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ తరుణంలో ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ(శుక్రవారం) భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.






