- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్‌ను అభినందించిన రఘురామకృష్ణం రాజు.. ఎందుకో తెలుసా..?
ఏపీ మాజీ సీఎం జగన్‌ను ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు అభినందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్‌ను ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు అభినందించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో ఒకే నిమిషం ఉండి ప్రమాణ స్వీకారం చేసి జగన్ వెళ్లిపోవడంపై ఆర్ఆర్ఆర్ మాట్లాడుతూ.. చాలా మంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కారని అనుకున్నారని.. కానీ వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారన్నారు. ఇవాళ డ్యూటీ ప్రమాణ స్వీకారం చేయడమే కాబట్టి జగన్‌ను అభినందించాలన్నారు. ఘోర పరాభవం తర్వాత ఎక్కువ సేపు కూర్చోవడం కష్టమే అన్నారు. కౌరవ సభ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఓటమి తర్వాత ఫ్రస్టేషన్‌లో అలా మాట్లాడటం సహజం అన్నారు. నాలుగు గోడల మధ్య ఏం మాట్లాడినా.. నలుగురి ముందుకు వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు అందుకు తనను అభినందిస్తున్నా అన్నారు. కొంత మంది స్పీకర్ రూంకి వెళ్లి చేయొచ్చు అన్నారని.. కానీ ఆయన రావడం అభినందనీయమన్నారు.






