- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SV University Ragging controversy: ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ వివాదం..
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ యూనివర్సిటీ)లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ యూనివర్సిటీ)లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. టీసీ తీసుకొని యూనివర్సిటీ నుంచి విద్యార్థినులు వెళ్లిపోయారు. సైకాలజీ విభాగంలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై నలుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, కంప్లయింట్ ఇచ్చిన ఫస్ట్ ఇయర్ సైకాలజీ నలుగురు విద్యార్థినులు పట్ల కక్ష్య సాధింపు చర్యలకు దిగినట్లు వర్సిటీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సైకాలజీ HOD విశ్వనాథ్ రెడ్డిపై ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి వచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఒత్తిళ్లు భరించలేక 4 గురు విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయినట్లు తెలిసింది. మరోవైపు ర్యాగింగ్ ప్రమేయం ఉన్నా.. ఆరుగురు సీనియర్ విద్యార్థులను ఎస్వీ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. అలాగే HOD ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డి ని సస్పెండ్ చేస్తూ వీసీ ఆదేశాలు ఇచ్చారు. టీసీ వివరాలకు క్లిక్ చేయండి..






