ఆ ప్రచారంలో నిజం లేదు.. చిరంజీవి వల్లే సమస్య పరిష్కారమైంది: ఆర్.నారాయణ మూర్తి

by Gantepaka Srikanth |

బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆర్.నారాయణ మూర్తి స్పందించారు.

ఆ ప్రచారంలో నిజం లేదు.. చిరంజీవి వల్లే సమస్య పరిష్కారమైంది: ఆర్.నారాయణ మూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan)ని ఉద్దేశించి నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) చేసిన వ్యాఖ్యలపై నటుడు ఆర్.నారాయణ మూర్తి(R.Narayana Murthy) స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్ ప్రభుత్వం ఎవరినీ అవమానించలేదు. ఆయన సమావేశంలో నేను కూడా ఉన్నాను. చిరంజీవి వందకు వందశాతం నిజం చెప్పారు. చిరంజీవిని జగన్ అవమానించారంటూ జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధం. సినిమా వాళ్లకు జగన్ చాలా గౌరవం ఇచ్చారు. కేవలం చిరంజీవి వల్లే ఆరోజు ఇండస్ట్రీ సమస్య పరిష్కారం అయ్యింది’’ అని ఆర్.నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పటికే ఈ అంశంపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా స్పందించారు. ఈ మేరకు నెట్టింట ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల ధరల పెంపు కోరుతూ చేసిన ప్రయత్నాల్ని, అప్పుడు జరిగిన పరిణామాల్ని ఆ ప్రకటనలో వివరించారు. కొంతమంది నిర్మాతలు, దర్శకులు, ఇండస్ట్రీ ప్రతినిధులు నా వద్దకు వచ్చి టికెట్ల ధరల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కోరితేనే తాను మాట్లాడానని చిరంజీవి పేర్కొన్నారు.

Next Story