- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ‘క్వాంటం’ విప్లవం: 45 లక్షల మందికి ఏఐ, క్వాంటం నైపుణ్యాలు: చంద్రబాబు
రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసి, ఏపీని టెక్నాలజీ ఆవిష్కరణల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసి, ఏపీని టెక్నాలజీ ఆవిష్కరణల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 45 లక్షల మందిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం, డేటా సెక్యూరిటీ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, గన్నవరం మేధాటవర్స్‌లో ఏర్పాటు చేసిన ‘1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్‌బెడ్స్’ను సీఎం చంద్రబాబు ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ నుంచి లాంఛనంగా ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.
డిసెంబర్‌లో క్వాంటం వ్యాలీ
అమరావతి వేదికగా ఈ ఏడాది డిసెంబర్ నుంచి ‘క్వాంటం వ్యాలీ’ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ‘ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త’ నినాదంతో పాటు, ప్రతి వెయ్యి మందికి ఒక స్టార్టప్ తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఆర్టీఐహెచ్ ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఐఐటీ-చెన్నై, ఐబీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో యువతకు క్వాంటం రంగంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సాంకేతికతతో ఔషధాల ఆవిష్కరణ, వ్యవసాయం, రక్షణ పరిశోధన, లాజిస్టిక్స్, క్లైమేట్ మోడలింగ్, డిజిటల్ లావాదేవీల భద్రత తదితర రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతిలో ఏదో మ్యాజిక్ ఉంది: ఎల్.వి. సుబ్రమణ్యం
దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని క్యూబిట్‌ఫోర్స్ సీఈవో ఎల్. వెంకట సుబ్రమణ్యం స్పష్టం చేశారు. కంపెనీ ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇచ్చిందని ప్రశంసించారు. సీఎం పిలుపును సవాలుగా తీసుకొని కేవలం నాలుగు నెలల్లోనే క్వాంటం బెడ్‌లు సిద్ధం చేశామన్న ఆయన.. ‘అమరావతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నిన్నటి విజన్.. నేటి నిజం.. రేపటి పరిశ్రమ.. ఇదే అమరావతి క్వాంటం’ అని కొనియాడారు.






