క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు మంత్రి నారా లోకేశ్ గుడ్‌న్యూస్..!

by Ramesh Naini |

ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు మంత్రి నారా లోకేశ్ గుడ్‌న్యూస్ చెప్పారు.

క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు మంత్రి నారా లోకేశ్ గుడ్‌న్యూస్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) గుడ్‌న్యూస్ చెప్పారు. గురువారం ఉండవల్లి నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు అవసరసమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్టార్టప్ ల వృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. (Quantum Computing Policy) క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీపైనా సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ఆయా పరిశ్రమలతో నిత్యం సంప్రదింపులు జరపాలని ఈడీబీ సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వివరాలను పోస్ట్ చేశారు. ట్వీట్..

Next Story