- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రఘురామ కృష్ణం రాజుని టార్గెట్ చేస్తూ పీవీ సునీల్ కుమార్ మరో వీడియో
ఏపి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజును టార్గెట్ చేస్తూ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మరో వీడియో విడుదల చేశారు. తాను మాట్లాడితేనే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను ప్రభావితం చేస్తున్నారని అంటున్నారని మరి మీరు ఎన్నిసార్లు మాట్లాడారని ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజును టార్గెట్ చేస్తూ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మరో వీడియో విడుదల చేశారు. తాను మాట్లాడితేనే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను ప్రభావితం చేస్తున్నారని అంటున్నారని మరి మీరు ఎన్నిసార్లు మాట్లాడారని ప్రశ్నించారు. మీరు అనేక సార్లు మీడియా ముందుకు వచ్చి తాగి ఇష్టమొచ్చినట్టు మాట్లాడలేదా అని వ్యాఖ్యానించారు. కాల్ రికార్డింగ్స్ బయటకు వస్తే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలపై ఒత్తిడి తెచ్చింది ఎవరో తెలుస్తుందని అన్నారు. ఆయన మీద నమోదైన కేసుల్లో ఎంతోమంది సాక్షులను రఘురామకృష్ణం రాజు బెదిరించలేదా అని ప్రశ్నించారు. మీరు మీ లాయ్ ఎవరెవరితో మాట్లాడారో డేటా తీయాలని అన్నారు. తాను కూడా దీనిపై పిటిషన్ వేస్తున్నానని చెప్పారు. అప్పుడు ఎవరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను ప్రభావితం చేశారో తేలిపోతుందని అన్నారు.






