- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రగ్స్ కేసు: "నా కొడుకు ఏ తప్పూ చేయలేదు": పుట్టా సుధాకర్
డ్రగ్స్ కేసులో తనకొడుకుకు ఏ సంబంధం లేదని, అతని ఏ తప్పూ చేయలేదని పుట్టా మహేష్ తండ్రి పుట్టా సుధాకర్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఇటీవల మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన ఓ పార్టీకి వెళ్లగా.. అక్కడ ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. బ్లడ్ శాంపిల్స్ డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై పుట్టా మహేష్ యాదవ్ తండ్రి పుట్టా సుధాకర్ స్పందించారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తన కొడుకు 100 శాతం తప్పు చేయలేదన్నారు. తన కుమారుడికి 2021లో హార్ట్ సర్జరీ జరిగిందని, పెద్ద స్టంట్ కూడా వేశారని, అప్పుడే డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారని తెలిపారు. పల్స్ రేటు 130- 140 కంటే ఎక్కువైతే డేంజరని హెచ్చరించారన్నారు. ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా మహేష్ డ్రగ్స్ ఎలా తీసుకుంటాడని ప్రశ్నించారు. తన కొడుకు డ్రగ్స్ తీసుకోలేదని టెస్టుల్లో తెలిందన్నారు. డ్రగ్స్ తీసుకున్నవాళ్ల పల్స్ రేటు 150 -200 వరకూ ఉంటుందని, మహేష్ పల్స్ రేట్ అంత లేదన్నారు. ఫాంహౌస్ పార్టీకి వెళ్లినపుడు మహేష్ పల్స్ రేటు 97గా ఉందన్నారు. పైగా బ్లడ్ శాంపిల్స్ రిపోర్టు రావాలంటే 48 గంటలు పడుతుందని, వెంటనే రిపోర్టు ఎలా వచ్చిందని మీడియా ముఖంగా నిలదీశారు. తాము ఢిల్లీ ఎయిమ్స్ లో బ్లడ్ శాంపిల్స్ ఇస్తే 48 గంటల్లోగా రిపోర్టు ఇవ్వలేదన్నారు. యూరిన్ శాంపిల్స్ రిజల్ట్ కూడా మొదటిసారి 10 నిమిషాల్లో చెప్పారని, రెండోసారి 5 గంటల సమయం పట్టిందన్నారు. దీనిని బట్టి మధ్యలో ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. బ్లడ్ రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చినట్లు చెప్పిన డ్రగ్స్.. సాధారణంగా మెడిసిన్ తీసుకున్నా వస్తాయని ఆక్స్ ఫర్డ్ చెప్పిందన్నారు. వాటిని చూపించి డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపిస్తున్నారన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక అన్ని ఎవిడెన్సులతో మళ్లీ మీడియా ముందుకు వస్తామని పుట్టా సుధాకర్ తెలిపారు. ఈ విషయంపై అధిష్ఠానానికి అన్ని వివరాలు చెప్పామని, ఏ నిర్ణయం తీసుకుంటారో వారి ఇష్టమన్నారు.






