Ap Politics: రప్పా రప్పాపై.. రచ్చ రచ్చ

by Thanuru Gopichand |

ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు పుష్ప సినిమా డైలాగ్​హాట్​టాపిగ్​గా మారిం ది.

Ap Politics: రప్పా రప్పాపై.. రచ్చ రచ్చ
X

ఏపీ రాజకీయాల్లో హాట్​టాపిక్ ​గా పుష్ప డైలాగ్​

ఒక్కొరినీ నరుకుతాం.. అంటూ ప్లకార్డుతో మొదలు

సినిమా డైలాగ్ ​రాస్తే తప్పేంటి అన్న వైఎస్ ​జగన్​

చంద్రబాబు, పవన్ ​సహా కూటమి నేతల ఖండన

దిశ, డైనమిక్​ బ్యూ రో : ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు పుష్ప (Puspha) సినిమా డైలాగ్​హాట్​టాపిగ్​గా మారిం ది. ‘2029తో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం.. ఒక్కొక్కరిని..’ అంటూ మొన్న సత్తెనపల్లిలో ఓ వైసీపీ (YCP) కార్యకర్త ప్లకార్డు ప్రదర్శించాడు. రాత్రి ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ అధినేత జగన్​.. ఆ ప్రెస్​మీట్​లో ఆ ప్లకార్డులోని వ్యాఖ్యలను ప్రస్తావించారు.. వాటిని సమర్ధించడం చర్చనీయాంశం అయింది. నిన్నటి విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు .. జగన్​(YS Jagan)వ్యాఖ్యలను ఖండించారు. అటువంటి వ్యాఖ్యలు చేస్తో ఊరుకోం అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్​, కాంగ్రెస్​పార్టీ నేత షర్మిల.. తదితరులు జగన్​వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ‘ ప్రజల ఇచ్చిన తీర్పుతో మతి భ్రమించి ప్యాలెస్ లో టీవీలు పగలగొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావా?’ అంటూ ప్రశ్నించారు. రప్పా రప్పా నరుకుతాం’ వ్యాఖ్యలను జగన్‌ సమర్థించడం దారుణం అని వైఎస్​షర్మిల అన్నారు. ‘ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు?.. జగన్ మాటలు చాలా దురదృష్టకరం.. రెచ్చగొట్టే, హింసాత్మక వ్యాఖ్యలు సరికాదు.. నరుకుతాం, చంపుతాం, దుస్తులు ఊడదీస్తామని అనడమేంటి?’ అని ఆమె ప్రశ్నించారు.

సినిమా డైలాగులు హాలు వరకే బాగుంటాయి ..

ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్​ఆదేశించారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాజీ సీఎం జగన్ మాట్లాడటంపై పవన్ కల్యాణ్ ఇవాళ ఒక ప్రకటనలో స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయన్నారు. వాటిని ఆచరణలో పెడతాం అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలు పాటిం చాల్సిందేనన్నారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించదని స్పష్టం చేశారు. కచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. అశాంతిని, అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయకపోగా, వారిని సమర్థించేలా మాట్లాడే వారి నేరమయ ఆలోచనలను గమనించాలని కోరారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమేనని పవన్ కల్యాణ్ తెలిపారు

Next Story