- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pulivendula : ఉపపోరు.. ఉద్రిక్తం.. పులివెందులలో టెన్షన్ టెన్షన్
ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్.. వేంపల్లిలో సతీష్‌రెడ్డి హౌస్ అరెస్ట్.. వంటి ఘటనలతో వేడెక్కింది.

ఒంటిమిట్టలో మంత్రి ఎదుటే బాహాబాహీ
వైసీపీ, టీడీపీ ముఖ్య నేతలు హౌస్అరెస్టు
పోలింగ్‌బూత్‌ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు
రిగ్గింగ్‌పై విమర్శలు చేసుకుంటున్న టీడీపీ, వైసీపీ నేతలు
టీడీపీకి చెందిన వారి కారు ధ్వంసం
వేరే ప్రాంతాల వారు వచ్చి ఓట్లు వేస్తున్నారని వైసీపీ ఆరోపణ
దిశ, డైనమిక్‌బ్యూరో / కడప : ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ అవినాష్‌రెడ్డి (Avinashreddy) అరెస్ట్.. వేంపల్లిలో సతీష్‌రెడ్డి హౌస్ అరెస్ట్.. వంటి ఘటనలతో వేడెక్కింది. ఉదయం 8 గంటల కు వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ (ZPTC Election) ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రెండు మండలాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా నిర్వహించేందుకు 1,400 మంది పోలీసులను నియమించారు. పులివెందుల, ఒంటిమిట్ట సరిహద్దు, జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పులివెందులలో బందోబస్తును కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. కాగా ఎన్నికలు మొదలైన దగ్గరి నుంచి పులివెందుల ఉద్రిక్తంగా మారింది. ఓటర్లు ఓటు వేసుకునేందుకు వెళ్లే పరిస్థితులు కూడా లేని పరిస్థితులు అక్కడ ఎదురు కావడం, దాడులకు దిగడం, ఓట్లను అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేయడం ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడంతో వంటి ఘటనలు జరిగాయి.
ఎన్నికల ముందే గొడవ జరిగిన నల్లగొండ వారి పల్లి నుంచి నల్లపురెడ్డి పల్లెలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్లగొండువాపల్లెలో ఓటు వేసేందుకు వెళ్ళనీయండి అంటూ ఓ వాటర్ పోలీసుల కాల్లు పెట్టుకోవడం వైరల్ గా మారింది. కణం పల్లె లో రామానుజన్ రెడ్డి ఇంటి వద్ద రామాంజనేయులు ఇంటి వద్ద మంచంపై పోలీసులు గన్ పెట్టి పెట్టడం వారిని, బెదిరిస్తున్నారని వైసీపీ చేసిన ట్వీట్ వైరల్ గా మారి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కణం పల్లెవేముల, దుగ్గన్న గారి పల్లి లో ఒక వర్గం వారు రిగ్గింగ్ చేసుకుంటున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసిలకు ఉపఎన్నిక పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అంటోంది. పులివెందులలో గతంలో ఏ ఎన్నికైనా అభ్యర్థులను నామినేషన్ కూడా వేయకుండా బెదిరించి ఏకగ్రీవం చేసుకు నేవారు. ఒకవేళ ఎన్నిక తప్పనిసరి అయితే పూర్తిగా రిగ్గింగ్ నడిచేది. ఈసారి అలా కాకుండా 11 నామినేషన్లు దాఖలు కావడం, రిగ్గింగ్ కు అవకాశం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తుండటంతో వైసీపీ జీర్ణించుకోలేక దాడులకు, గొడవలకు దిగుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది.
కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలింగ్ కు ముందే అరెస్ట్ చేసి బయట ప్రాంతానికి తరలించారు. వీరితోపాటు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని హౌసెస్ లో ఉంచా రు. పులివెందుల పోలింగ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పులివెందులలో 144 సెక్షన్ విధించారు. అరెస్టు చేసే సమయంల ఎంపీ అవినాష్మాట్లాడుతూ పోలింగ్ బూత్‌ల దగ్గరికి వైసీపీ ఏజెంట్లను రానియ్యకుండా టీడీపీ అడ్డుకుంటున్నారు. పోలీసులు వారికి మద్దతిస్తూ వైయస్‌ఆర్‌సీపీ వాళ్లపై లాఠీలు ఝళిపిస్తున్నారని ఆరోపించారు. ఉదయం 10-11 గంటల వరకూ మేము రిగ్గింగ్ చేసుకుంటాం.. ఆ తర్వాత మీరు ఓట్లు వేసుకోండని టీడీపీ వాళ్లు సిగ్గులేకుండా చెప్తున్నారని అన్నారు.
ఒంటిమిట్టలోని (Ontimitta) చింతరాజుపల్లె, రాచపల్లిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చింతరాజుపల్లె పోలింగ్ బూత్‌లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీకి చెందిన వారి కారు ధ్వంసం చేశారని ఆ పార్టీవారు ఆరోపిస్తున్నారు. బూత్‌లో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కణంపల్లిలోనూ పోలీసులు, స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది. బయట వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చారంటూ స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిన్న కొత్తపల్లి బూత్ నంబర్-7లో గందరగోళ వాతావరణం ఏర్పడింది. వైసీపీ ఏజెంట్లు దొంగ ఓట్లు వేస్తున్నారన్న సమాచారంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ వర్గాల పరస్పర దాడులు చేసుకున్నారు. పిడిగుద్దులతో పరస్పరం ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. గొడవను సద్దుమణిగేలా చేసి ఇరువర్గాలను పోలీసు చెదరగొట్టారు. ఒంటిమిట్ట మండలంలో జడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 38.64 శాతం పోలింగ్ నమోదైంది.






