రెండేళ్లలో అమరావతిలో పులస చేపలు దొరుకుతాయి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రాజధాని అమరావతిపై వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండేళ్లలో అమరావతిలో పులస చేపలు దొరుకుతాయి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని అమరావతిపై వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ఇవాళ అనంతపురం వైసీపీ నేతలు కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఆధ్వర్యంలో ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రానున్న రెండేళ్లలో ఇదే అమరావతిలో పులస చేపలు కూడా దొరకుతాయని సెటైర్లు వేశారు. వరుస వర్షాలకు ప్రస్తుతం గోదావరి నది ఎలాగైతే పొంగిపొర్లుతుందో అదే మాదిరిగా అమరావతికి కూడా అదే గతి పట్టబోతోందని జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వానికి జైకోడితే.. వారు దేశభక్తులు అవుతారని, లేకపోతే వారిని సంఘ విద్రోహ శక్తులు, దేశ ద్రోహులుగా చూస్తారని కామెంట్ చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు బానే ఉంటారని, భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Next Story