Ap: పీఎస్ఆర్ ఆంజనేయులకు మరోసారి అస్వస్థత

by Vemula.Srinu Prasad |

పీఎస్ఆర్ ఆంజనేయులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు..

Ap: పీఎస్ఆర్ ఆంజనేయులకు మరోసారి అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ మాజీ సీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గ్రూప్-1 మూల్యాంకనం(Group-1 Evaluation)లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై నమోదైన కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయన బుధవారం జైలులో అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో ఆయన బాధపడ్డారు. దీంతో ఆంజనేయులను ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల క్రితం సైతం ఆంజనేయులు ఆస్వస్థతకు గురయ్యారు. అయితే అప్పుడు వైద్యం అందించి మళ్లీ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అనంతరం ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Next Story