- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతి పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు నిరసన సెగ
తిరుపతి పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే శ్రీకాలహస్తి జనసేన మాజీ ఇంచార్జ్ కోట వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే శ్రీకాలహస్తి జనసేన మాజీ ఇంచార్జ్ కోట వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పవన్ కల్యాణ్ మీరే మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మరోవైపు తిరుపతి కలెక్టరేట్ వద్ద రాయుడు కుటుంబ సభ్యులు నినాదాలు చేశారు.
డ్రైవర్ రాయుడు పవన్ కల్యాణ్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. పవన్ పై అభిమానంతోనే పార్టీలో ఉండవచ్చని కోట వినూత వద్ద రాయుడు డ్రైవర్ గా చేరారు. అంతేకాకుండా కాటమరాయుడు సినిమా తరవాత తన పేరును రాయుడుగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు అతడి మృతిపై పవన్ స్పందించారు. దీంతో పవన్ కల్యాణ్ స్పందించాలంటూ రాయుడు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిమమనాయుడు పాళ్యంలో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలి అంటూ కూడా కొంతమంది స్థానికులు నిరసన తెలిపారు. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన మీరు పేద దళితుల జీవితాల్లోనూ వెలుగులు నింపాలని కోరారు.






