డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ

by Ajay Maddhiboyina |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. డీఎస్సీ నుండి పీఈటీని ఎత్తివేయడంపై అభ్యర్థులు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. డీఎస్సీ నుండి పీఈటీని ఎత్తివేయడంపై అభ్యర్థులు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో సంతాప సభ ఏర్పాటు చేయడంతో పవన్ అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పీఈటీ అభ్యర్థులు అక్కడకు చేరుకుని... పాదయాత్రలో నారాలోకేష్ తమకు హామీ ఇచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం మీరైనా న్యాయం చేయాలంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ప్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేష్ విడుదల చేయాలని దాని ద్వారా పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వారు నిరసన చేస్తున్న సమయంలో పవన్ కాన్వాయ్ వారిని పట్టించుకోకుండా వెళ్లిపోయింది. దీంతో అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందారు. ఇదిలా ఉంటే ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

Next Story