- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Y. S. Rajasekhara Reddy : వైఎస్సార్‌ను గుర్తుచేసే కార్యక్రమాలు!
రాజకీయాల్లో ఒక్కో నేతకు ఒక్కో విధానం ఉంటుంది. ఎవరికి వారు వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో ఒక్కో నేతకు ఒక్కో విధానం ఉంటుంది. ఎవరికి వారు వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరు ప్రచార ఆర్భాటాలకే పరిమితం కాగా, ఇంకొందరు నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పదంతో రాజకీయాల్లో వస్తుంటారు. ఇలా వచ్చిన వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారనడంలో సందేహం లేదు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) కూడా ఈ కోవకు చెందిన వారే అని ఇవాళ ప్రజల స్పందన చూస్తుంటే తెలుస్తోంది. వైఎస్ఆర్ తీసుకొచ్చిన పథకాలు ప్రజలు ఎంత ఉపయోగపడ్డాయో అర్ధం అవుతోంది.
అందులో ముఖ్యంగా.. ‘ఆరోగ్యశ్రీ(Rajiv Aarogyasri), 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతుల రుణమాఫీ, చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు’ వంటివి జనాలను విపరీతంగా ఆకర్షించాయి. వీటితోపాటు ఇవాళ రాయలసీమకు కృష్ణా నీళ్లు అంతో ఇంతో అందుతున్నాయంటే, నాడు ఆయన కట్టిన ప్రాజెక్టులు, తీసిన కాలువల పుణ్యమే అని ప్రజలు కొనియాడుతున్నారు. నేడు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ పోస్టు పెడుతున్నారు.






