సివిల్ పంచాయితీలో పోలీసుల జోక్యం.. సీఎం చంద్రబాబుకు కంప్లైట్...?

by Vemula.Srinu Prasad |

సివిల్ పంచాయితీలో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ప్రొద్దటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు....

సివిల్ పంచాయితీలో పోలీసుల జోక్యం.. సీఎం చంద్రబాబుకు కంప్లైట్...?
X

దిశ, వెబ్ డెస్క్: సివిల్ పంచాయితీలో పోలీసులు(Police) జోక్యం చేసుకోవడంపై ప్రొద్దటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి(Proddatur MLA Varadarajula Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారి శ్రీనివాసులు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. శ్రీనివాసులను పోలీసులు కొట్టారని వరదరాజులరెడ్డి ఆరోపించారు. అంతేకాదు శ్రీనివాసులు సోదరులను అక్రమంగా నిర్బంధించారని, రూ. 7 కోట్ల విలువైన పత్రాలను ఎత్తుకెళ్లారని వ్యాఖ్యానించారు. పోలీసుల తీరుపై చట్టబద్ధంగా పోరాటం చేస్తామని చెప్పారు. అంతేకాదు ఘటనపై సీఎంకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి హెచ్చరించారు.

Next Story