Proddatur: ఆంజనేయస్వామి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం

by Thanuru Gopichand |

ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Proddatur: ఆంజనేయస్వామి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో (Proddatur) అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం ప్రొద్దుటూరు పట్టణంలోని పాత మార్కెట్లో ఆంజనేయస్వామి దేవాలయం (Anjaneyaswamy Devalayam) ఉంది. ఆలయానికి అనుబంధంగా దుకాణాలు ఉన్నాయి. వాటిల్లో ఒక పూజా సామాగ్రి దుకాణం కూడా ఉంది. సోమవారం రాత్రి సమయంలో దుకాణంలో నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. కొద్దిసేపటికి మంటలు అంటుకొని వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు దుకాణ యజమానికి (Shop Owner) సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న యజమాని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన బయలుదేరి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. అయితే ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దుకాణంలోని సామాగ్రి మంటల్లో కాలిపోయినట్లు యజమాని పేర్కొన్నారు. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు.

Next Story