YS Sharmila:‘గ్రూప్-2 అభ్యర్థుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-21 10:02:40  IST  )

ఏపీలో గ్రూప్-2 మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ పోస్ట్ పోన్ చేయాలంటూ అభ్యర్థులు నేడు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ స్టడీ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు.

YS Sharmila:‘గ్రూప్-2 అభ్యర్థుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గ్రూప్-2 మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ పోస్ట్‌పోన్ చేయాలంటూ అభ్యర్థులు నేడు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ స్టడీ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటన పై తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థుల తరపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2023 డిసెంబర్ 11న ఇచ్చిన నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

తప్పులను సరిదిద్దకుంటే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. రోస్టర్ విధానంలో తప్పులతో ఝార్ఖండ్‌లో నోటిఫికేషన్ రద్దయ్యి ఉద్యోగాలు పోయిన పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవుతాయని భయపడుతున్నారని వైఎస్ షర్మిల తెలిపారు. తప్పులు సరిదిద్దాలని అభ్యర్థులు కోరుతుంటే.. మరోవైపు అడ్వకేట్ జనరల్ సైతం కోర్టులో తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటే, హడావిడిగా ఈ నెల 23న పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

APPSC మొండిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోరా అని నిలదీశారు. రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దే అంశంపై, మెయిన్స్ పరీక్షల నిర్వహణపై కూటమి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉన్న మెయిన్స్ అభ్యర్థులను పిలిచి చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story