- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ వాహనాలే దిక్కు.. బస్సు సౌకర్యం కల్పించండి సారు
పేద విద్యార్థుల చదువుకు పెద్ద కష్టమే వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : చాలా వరకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువు కోసం ప్రభుత్వ బడులకు వెళ్తుంటారు. కొన్ని గ్రామాల్లో బడి ఉంటే.. మరికొన్ని గ్రామాలకు కలిపి బడులు ఉంటాయి. ఇంకొన్ని గ్రామాలకు చెందిన విద్యార్థులు మండల కేంద్రాల్లోని ప్రభుత్వ బడులకు చదువుకోవడానికి వెళ్తుంటారు. అయితే సమీపంలో బడి ఉంటే ఇబ్బంది లేదు.. కానీ దూర ప్రయాణం చేయాలంటే రవాణా సౌకర్యం తప్పనిసరి. ముఖ్యంగా పేద విద్యార్థులకు రోజువారీ ప్రయాణం అనేది వ్యయప్రయాసలతో కూడినది. ప్రతిరోజూ ప్రైవేటు వాహనాల్లో బడికి రాకపోకలు చేయించాలంటే వారి తల్లిదండ్రులకు కూడా తలకు మించిన భారం అవుతుంది. అందుకే చాలా వరకు గ్రామాలకు చెందిన ప్రభుత్వ బడుల విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగిస్తుంటారు. ప్రభుత్వ సబ్సిడీ పాసులను పొంది వాటిని వినియోగించుకుంటారు. అయితే ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం సరిగ్గా లేదని తెలుస్తోంది. అటువంటి గ్రామాల్లో కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని కురుకుంద, ముద్దనగేరి గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి సరైన బస్సు సౌకర్యం లేని కారణంగా విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వారిని బడికి పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనిపై బీసీవై పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు అర్జున్ శుక్రవారం మాట్లాడుతూ కురుకుంద, ముద్దనగేరి తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు బడికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేదన్నారు. ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురై చాలా మంది విద్యార్థులను ఇంటికే పరిమితం చేస్తున్నారని పేర్కొ్న్నారు. కాబట్టి ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి సరైన బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.






