- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP: మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో అర్ధరాత్రి ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు, కిందికి దిగినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే పెను ప్రమాదమే తప్పిందట.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రోజుకో పెను ప్రమాదం చోటు చేసుకుంటుంది. పొద్దున లేస్తే చాలు, ఎలాంటి వార్త వింటామో అని జనాలు వణికిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో మరో పెను ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మంటల్లో దగ్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో అర్ధరాత్రి ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు, కిందికి దిగినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే పెను ప్రమాదమే తప్పిందట. ఇక ఈ ప్రమాద సంఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రంగంలోకి దిగారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవల కాలంలోనే కర్నూలు బస్సు ప్రమాదంలో ఏకంగా 19 మంది మరణించిన సంగతి తెలిసిందే.
Read More..






