- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ బస్సు ప్రమాదం..డ్రైవర్ అప్రమత్తతో 10 మంది సేఫ్..!
షార్ట్ సర్క్యూట్ వల్లే బస్సు అగ్నిప్రమాదానికి గురైందట. ఇక ఈ బస్సు ప్రమాద ఘటనపై డ్రైవర్ సైదులు స్పందించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు ఎగసిపడ్డాయని పేర్కొన్నారు డ్రైవర్. అప్రమత్తమై ప్రయాణికులను కిందికి దింపేసినట్లు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై బస్సు దగ్ధం అయిన సంగతి తెలిసిందే. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే బస్సు అగ్నిప్రమాదానికి గురైందట. ఇక ఈ బస్సు ప్రమాద ఘటనపై డ్రైవర్ సైదులు స్పందించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు ఎగసిపడ్డాయని పేర్కొన్నారు డ్రైవర్. అప్రమత్తమై ప్రయాణికులను కిందికి దింపేసినట్లు వెల్లడించారు.
మొదట గామన్ బ్రిడ్జి వద్ద అరగంట భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో బస్సు అక్కడే చిక్కుకుపోయిందని తెలిపారు. ఇక ఆ తర్వాత కొంత ముందుకు వెళ్ళగానే ఒక్కసారిగా బస్సులో మంటలు వచ్చినట్లు తెలిపాడు డ్రైవర్ సైదులు. వెంటనే మా సిబ్బందిని అలెర్ట్ చేయడంతో వారు ప్రయాణికులు అందరినీ కిందకి దింపినట్లు తెలిపారు. అలా దాదాపు పది మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడట సైదులు. దీంతో సైదులుపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
Read More..






