Viral News : ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ లాంటి సౌకర్యాలు : ఏపీ నెటిజన్ ట్వీట్ వైరల్

by M.Rajitha |
Viral News : ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ లాంటి సౌకర్యాలు : ఏపీ నెటిజన్ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రి(Telangana Govt Hospital)లో వైద్య సేవలు అమోఘం అంటూ రాసుకొచ్చాడు ఏపీకి చెందిన ఓ నెటిజన్(AP Netizen). ఉగాది పండగకి స్నేహితులతో గడపడానికి ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ యువకుడు ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి గురవ్వగా.. తోటి స్నేహితులు 108కు ఫోన్ చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital)లోని అత్యవసర విభాగానికి తరలించారు. వెంటనే అతనికి ఎక్స్ రే, యూసీజీ తీయగా.. పేగుకు రంధ్రం పడినట్టు తేలింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. సర్జరీ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు వైద్యులు.

ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న యువకుడు తెలంగాణలో వైద్య సేవలను ఆకాశానికి ఎత్తేశాడు. పొరుగు రాష్ట్రం అని తెలిసినా.. స్థానిక వివరాలు ఏవీ లేకపోయినా ప్రైవేట్ ఆసుపత్రి స్థాయి కంటే మెరుగైన చికిత్స, వేగంగా అందించారని అతడు కొనియాడాడు. తనను తక్షణమే ఆసుపత్రికి చేర్చిన 108 సిబ్బందికి, సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన వైద్య బృందానికి, ఆసుపత్రి సిబ్బందికి, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ కూడా వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story