- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖైదీ రాసలీలలు.. వీడియో వైరల్
జీవిత ఖైదు శిక్ష పడ్డ ఓ రౌడీ షీటర్ దర్జాగా రాసలీలలు అనుభవిస్తున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : జీవిత ఖైదు శిక్ష పడ్డ ఓ రౌడీ షీటర్ దర్జాగా రాసలీలలు అనుభవిస్తున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లాలోని సెంట్రల్ జైలులో హత్య కేసులో గూడూరుకు చెందిన రౌడీషీటర్ శ్రీకాంత్ జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం పేరుతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఒక మహిళతో ఆసుపత్రి బెడ్‌పై అనుచితంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటన ఆగస్టు 2025లో బయటకు రావడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీకాంత్‌కు పోలీసులే సహకరించారని, ఆసుపత్రిలో అతని రాసలీలలకు అవకాశం కల్పించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో జైలు అధికారులు, పోలీసుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.






