ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం : మంత్రి అచ్చెన్నాయుడు

by Thanuru Gopichand |

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం : మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Konaseema) కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సహచర మంత్రి వాసంశెట్టి సుభాష్ (Vasamsetti Subash), జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రధానంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి.. ఏ పనులు పరిస్థితి ఎలా ఉందనేది చర్చించారు. అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాల (Welfare Schemes) ఫలాలు పొందేలా చూడాలన్నారు. మొంథా తుఫాను (Montha Cyclone) కారణంగా కలిగిన నష్టంపై అంచనాలు ఇప్పటికే రూపొందించామన్నారు. త్వరలోనే కేంద్రానికి అంచనాలను పంపిస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు (Farmers) హెక్టారుకు రూ.25వేలు పరిహారంగా (Compensation) అందిస్తామని ప్రకటించారు. అరటి పంటకు రూ.35వేలు పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు.

Next Story