- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు అరెస్ట్‌పై ప్రిన్స్ మహేశ్ బాబు బాబాయ్ రియాక్షన్
by Seetharam |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని ప్రముఖ సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరావు అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని ప్రముఖ సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరావు అన్నారు. వైఎస్ జగన్ పాలనలో కొత్త తరహా కక్ష రాజకీయాలు చూస్తున్నానని ఆరోపించారు. రాజమహేంద్ర వరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి,బ్రహ్మణి, ఇతర కుటుంబసభ్యులను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు బుధవారం పరామర్శించారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇద్దరినీ సీఎంలుగా చూశానని కానీ ఈ తరహా కక్ష సాధింపు రాజకీయాలు వారి మధ్య లేవు అని చెప్పుకొచ్చారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అని విమర్శశించారు. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నిర్మాత ఆదిశేషగిరిరావు హితవు పలికారు.
Next Story






