‘మన్ కీ బాత్‌’లో ప్రధాని వ్యాఖ్యలు రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం: మంత్రి నారాయణ

by Jakkula.Mamatha |

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఆదివారం జరిగిన ‘మన్ కీ బాత్’ లో చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ(AP Government) అభివృద్ధికి నిదర్శనమని ఏపీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.

‘మన్ కీ బాత్‌’లో ప్రధాని వ్యాఖ్యలు రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం: మంత్రి నారాయణ
X

దిశ,వెబ్‌డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఆదివారం జరిగిన ‘మన్ కీ బాత్’ లో చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ(AP Government) అభివృద్ధికి నిదర్శనమని ఏపీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. విజయవాడలోని నీటి సరఫరాను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించడం గర్వకారణమని మంత్రి తెలిపారు. నిన్న ‘మన్ కీ బాత్’ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. విజయవాడలో నీటి సరఫరా చాలా బాగుందని ప్రశంసించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందనడానికి నిదర్శనమని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పర్యవేక్షనతో నగరానికి ఇటివేల స్వచ్చ సర్వేక్షణ్ అవార్డు దక్కిందని మంత్రి నారాయణ(Minister Ponguru Narayana) గుర్తుచేశారు. విజయవాడ(Vijayawada) కార్పొరేషన్ ద్వారా ప్రతిరోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు, కొండ ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇబ్బందుల్లేకుండా నీటి సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఏపీకి అమృత్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించిందని.. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారాయణ సింగపూర్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Next Story